WhatsApp Group

V TG CET-2023

📚  టీజీ సెట్‌-2023 | గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

తెలంగాణ గురుకులాలు విద్యార్థులకు వరంగా మారాయి. రాష్ట్రం ఆవిర్భవించాక ప్రభుత్వం వీటిని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుంది. గురుకులాలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమం బోధిస్తూ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి, యూనిఫాంలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ వివరాలు సంక్షిప్తంగా..

దరాఖాస్తు వివరాలు..

తెలంగాణలోని అన్ని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల 8న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖల ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తుంది. ఇందుకు 2022-23 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన విద్యార్థులు ఈనెల 9 నుంచి మార్చి 6వ తేదీలోపు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఏప్రిల్‌ 13 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 23న ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

        సూచనలు

ఆన్‌లైన్‌లో రూ.100 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. 

ఒక ఫోన్‌ నంబర్‌తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలి.

ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని అంటే బోనఫైడ్‌/స్టడీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాలి.

బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

 1-9-2011 నుంచి 31-8-2013 మధ్య జన్మించి ఉండాలి (1-9-2023 వరకు 9 నుంచి 11 సంవత్సరాల వయస్సు ఉండాలి). ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 1-9-2023 వరకు 9 నుంచి 13 ఏళ్ల వయస్సు ఉండాలి (1-9-2009 నుంచి 31-8-2013).

వెబ్‌సైట్‌: tgcet.cgg.gov.in

error: Content is protected !!