ఈ వెబ్ పేజిలో ప్రతీ రోజు ప్రార్థనా సమావేశానికి సంబంధించిన తెలుగు వార్తలు అందించడం జరుగుతుంది.
*23-11-2024*
నేటి వార్తలు
నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి
*****—–****_____******
శుభోదయం
ఔషధ రంగంలో 12,490 ఉద్యోగ అవకాశాలు, గ్రీన్ ఫార్మా విలేజ్ లో పరిశ్రమల స్థాపన, ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు.
భిన్నత్వంలో ఏకత్వం మన గొప్పదనం, బానిసత్వం నుంచి వికసిత్ భారత దిశగా ఎదుగుతున్నాం, లోక్ మంథన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సులభతర వ్యాపారాలకు త్వరలో కొత్త ఐటి పారిశ్రామిక విధానం , సి ఐ ఐ దక్షిణ భారత ప్రాంతీయ మండలి సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు.
ఫిబ్రవరిలో గ్రూపు -1 ఫలితాలు, యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ, నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు .
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడే, శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పూర్తయిన ఏర్పాట్లు .
ప్రజా పాలన విజయోత్సవాల లో భాగంగా ఈ నెల 30న మహబూబ్నగర్లో రైతు దినోత్సవ సభ ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు .
క్రీడా వార్తలు
తొలి టెస్ట్ లో ఆసీస్ 67/7,
భారత్ 150 ఆలౌట్.
నేటి సూక్తి
కనిపించని భగవంతుని కంటే …కనిపించే తల్లిదండ్రులు గొప్పవారు .
ఆరోగ్య చిట్కా
విటమిన్ ఏ, డి ,ఈ సాధ్యమైనంత మేరకు ఆహార పదార్థాలు మరియు సహజసిద్ధంగా శరీరానికి అందించే ప్రయత్నం చేయాలి .
నిన్నటి జీకే
G-20 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న దేశం ఏది?
జవాబు:- బ్రెజిల్.
నేటి జీకే
జనన , మరణాల నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంబించిన ఆప్ పేరేంటి?