WhatsApp Group

ADMISSIONS INTO RUKMAPUR SAINIK SCHOOL

తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో ఆరోతరగతి ప్రవేశాలు

మిలిటరీ ఎడ్యుకేషన్‌, త్రివిధ దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో, INTER ప్రవేశాలకు గాను అర్హులైన బాలుర నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. 

వివరాలు:

ఆరో తగరతి(సీబీఎస్ఈ కరిక్యులం): మొత్తం 80 సీట్లు

రిజర్వేషన్లు: ఎస్సీ- 60, బీసీ-సీ- 02, ఎస్టీ- 05, బీసీ- 10, మైనార్టీ- 02, ఓసీ/ ఈబీసీ- 01 సీట్లు కేటాయించారు.

సంస్థ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల(బాలురు), రుక్మాపూర్, కరీంనగర్ జిల్లా.

అర్హత:

2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. తెలుగు/ ఇంగ్లిషు మీడియం విద్యార్థులు అర్హులు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

01.04.2023 నాటికి 11 ఏళ్లు మించకూడదు. 01.04.2012 నుంచి 31.03.2014 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

మూడంచెల్లో ఉంటుంది. స్టేజ్-1 (స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ – 100 మార్కులు), స్టేజ్-2 (స్క్రీనింగ్ టెస్టులు – 150 మార్కులు). ఇందులో ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ (రాత & డిస్క్రిప్టివ్), కమ్యూనికేషన్ స్కిల్ టెస్టులు ఉంటాయి. వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31.01.2023. 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.02.2023.

హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్: 17.02.2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 26.02.2023.

రాత పరీక్ష ఫలితాల విడుదల: 08.03.2023.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేదీలు: 20, 22, 24, 25, 26.03.2023.

తుది ఫలితాల ప్రకటన: 28.03.2023.

పాఠశాలలో ప్రవేశాల ప్రారంభం: 30.03.2023.

CLASS-6 పూర్తి వివరాలు:-

ఇంటర్ పూర్తి వివరాలు:-

error: Content is protected !!