WhatsApp Group

5TH GURUKUL TG V CET 2024

గురుకులలో 5వ తరగతి ప్రవేశ అప్లికేషన్ తేదీ పొడిగింపు

అప్లికేషన్ చివరి తేదీ : 20-01-2024

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ

TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2024-25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదురుకోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC, ST, BC మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్నవి

   అప్లికేషన్ ప్రారంభ తేదీ

     తేదీ : 18-12-2023

     అప్లికేషన్ చివరి తేదీ

     తేదీ : 20-01-2024

     ఆన్లైన్ వెబ్సైట్

 www.tswreis.ac.in

www.tgcel.cgg.gov.in

     ప్రవేశ పరీక్ష తేదీ

 తేదీ : 11-02-2024

సమయం : ఉదయం 11:00  నుండి మధ్యాహ్నం 1:00 వరకు

1. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేది. 18-12-2023 నుండి 20-01-2024 వరకు ఆన్లైన్లో రూ.100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకొనవచ్చును. ఒక ఫోన్ నెంబర్ ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును.

2. విద్యార్థుల ఎంపికకు “పాత జిల్లా” ఒక యూనిట్ గా పరిగణింపబడుతుంది.

3. 2023-2024 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, 

4. విద్యార్థులు ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్ / స్టడీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

error: Content is protected !!